అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో రెండు తలలతో దూడ జన్మిచింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రాకాసీపేట్లో పాడిరైతు రాములుకు చెందిన గేదె సోమవారం ఉదయం రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు ఆరుకాళ్లు కూడా ఉండడంతో.. దీనిని చూసేందుకు స్థానికులు రాములు ఇంటికి తరలివచ్చారు. అయితే పుట్టిన కొద్దిసేపటికే దూడ మృతి చెందింది.
