Ex Mla Jeevan Reddy
Ex Mla Jeevan Reddy | రాష్ట్రంలో కేడీలు, బేడీల పాలన

అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)లో అంతా కేడీలు, బేడీల పాలన కొనసాగుతోందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది గోల్డెన్ పీరియడ్ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనడాన్ని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 50 ఏళ్ల నాటి చీకటి ఎమర్జెన్సీ పీరియడ్(Emergency period)ను తలపిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలకు ఎగనామం పెట్టి ప్రజలను నిలువునా ముంచిన దగాకోరు పార్టీ అది అని విమర్శించారు. కేసీఆర్​(KCR)ను, ఆయన ఫ్యామిలీని తిట్టందే రేవంత్ కు పూట గడవదన్నారు. తన గురువు చంద్రబాబు(Chandrababu) కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ విద్రోహ పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్​ను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు.