అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | విద్యుత్ స్తంభాలకు టీవీ, ఇంటర్ నెట్ కేబుళ్లతో (TV and internet cables) ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యుత్ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల రామాంతపూర్‌లో శ్రీకృష్ణాష్టమి (Sri Krishna Ashtami) సందర్భంగా రథాన్ని లాగుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందారు.
రామాంతపూర్ ఘటనకు కేబుల్ వైర్లే కారణమని అధికారులు పేర్కొన్నారు. దీంతో స్తంభాలకు ఏర్పాటు చేసిన వైర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారులు విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను తొలగిస్తున్నారు. అయితే ఈ రామాంతపూర్ ఘటనను సుమోటగా స్వీకరించిన హైకోర్టు (High Court) రెండు రోజుల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ఎస్పీడీసీఎల్, జీహెచ్ఎంసీ, భారతీ ఎయిర్టెల్ కంపెనీలకు (Bharti Airtel company) నోటీసులు ఇచ్చింది. ఎయిర్టెల్ కంపెనీ కేబుల్ వైర్లతో సదరు ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
High Court | అనుమతి తప్పనిసరి
హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఎయిర్టెల్ కంపెనీ శుక్రవారం పిటిషన్ వేసింది. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ స్తంభాలకు (electricity poles) లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు మాత్రమే ఉంచాలని ఆదేశించింది. అనుమతి లేకుండా కేబుళ్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడంపై సీరియస్ అయింది. విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అంటూ ప్రశ్నించింది. అనంతరం జస్టిస్ నగేశ్ విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
High Court | ఇబ్బందులు పడుతున్న ప్రజలు
విద్యుత్ స్తంభాలకు ఇష్టారీతిన ఏర్పాటు చేసిన కేబుళ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇంటర్ నెట్, టీవీ కేబుళ్లను (internet and TV cables) తొలగిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్ నెట్ కేబుళ్లు కట్ చేస్తుండటంతో నెట్ రాక అవస్థలు పడుతున్నారు.