అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో కులగణన నివేదికపై (caste census report) కేబినెట్ చర్చించాలని భావించారు. అలాగే గోశాల విధానంపై (cowshed policy) తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు.
Cabinet : ఈ నెల 28న..
దీనికి తోడు కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలపాలని నిర్ణయించారు. అంతేకాకుండా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, వానాకాలం (monsoon) సాగు పనులు పుంజుకుంటున్న నేపథ్యంలో.. యూరియా లభ్యత, డిమాండ్‌పై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అంశంపైనా చర్చించాలని భావించారు.
కానీ.. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేరు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. నలుగురు మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నెల (జులై) 28న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.