ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Amaravati | అమ‌రావతిలో భూమి కేటాయింపులు.. ఏయే సంస్థ‌కు ఎంత కేటాయించ‌నున్నారంటే..!

    Amaravati | అమ‌రావతిలో భూమి కేటాయింపులు.. ఏయే సంస్థ‌కు ఎంత కేటాయించ‌నున్నారంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amaravati | ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఈరోజు (సోమవారం) భూ కేటాయింపుల‌కు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ.. 16 అంశాలకు గాను 12 అంశాలు మంత్రివర్గ ఉప సంఘంలో ఆమోదం పొందాయని చెప్పుకొచ్చారు. 2014- 19 కాలంలో రాజధానిలో భూములు కేటాయించిన సంస్థల్లో నాలుగు సంస్థలను కొనసాగిస్తూ ఆమోదం తెలిపామన్నారు. సెంట్రల్​ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌(Central Bureau of Investigation)కు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ ఆమోదం తెలిపామని చెప్పారు.

    Amaravati | పెద్ద ప్రాజెక్టులు ప్రారంభం..

    జియలాజికల్ ఆఫ్ సర్వే సంస్థ(Geological Survey of India)కు రెండు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌(State Forensic Science Lab)కు ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌(AP Cooperative Bank Limited)కు మూడు ఎకరాల కేటాయింపును కొనసాగిస్తూ అంగీకారం తెలిపామన్నారు. ఈ నాలుగు సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదించినట్లు మంత్రి Minister చెప్పుకొచ్చారు. 2014- 19లో కేటాయించిన రెండు సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశామన్నారు.

    ఇక గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగర్బత్తికి భూ కేటాయింపులు రద్దు చేశామన్నారు. కొత్తగా ఆరు సంస్థలకు భూ కేటాయింపులు చేశామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు రెండు ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంక్‌(AP Gramin Bank)కు రెండు ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటలిజెన్స్ బ్యూరో (SIB)కు 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌కు 0.5 ఎకరాలు, బీజేపీ పార్టీ(BJP party)కి రెండు ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2014- 2019 కాలంలో 130 సంస్థలకు 1,270 ఎకరాలు ఇచ్చామని.. ఈ సంస్థల్లో కొంత మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఈరోజు పది సంస్థలకు భూ కేటాయింపులు చేశామని తెలిపారు. గతంలో కేటాయించిన సంస్థలకు టైం బాండ్ ముగిసిందని మంత్రి చెప్పారు. కేటాయించిన సమయంలో నిర్మాణాలు చేపట్టకపోతే భూములు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...