Homeతాజావార్తలుCabinet Meeting | 15న కేబినెట్​ సమావేశం.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాన చర్చ

Cabinet Meeting | 15న కేబినెట్​ సమావేశం.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాన చర్చ

Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 15న జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇందులో చర్చించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet Meeting | తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 15న సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనుంది.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సర్పంచుల పదవీకాలం ముగిసిపోయి దాదాపు 19 నెలలు అవుతోంది. ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC)లు మాజీలు అయి కూడా ఏడాది దాటింది. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. జులైలోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగినా సాధ్యం కాలేదు. సెప్టెంబర్​ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా ఎన్నికలు జరగలేదు. ఎట్టకేలకు అక్టోబర్​ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడింది. దీంతో నెలలుగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Cabinet Meeting | తేలని రిజర్వేషన్ల పంచాయితీ

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) పంచాయితీ తేలడం లేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ అమలు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేయగా.. ఆ మేరకు ఎన్నికల సంఘం(Election Commission) నోటిఫికేషన్​ విడుదల చేసింది. అయితే మరుసటి రోజే.. హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 15 సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 13న ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్​ చేయనుంది. ఈ క్రమంలో సుప్రీంలో కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఎలా ముందుకు సాగాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.