అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సుదీర్ఘంగా కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ముగిసింది. మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) మినహా మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ (BC Reservation Ordinance) పైనా చర్చించినట్లు సమాచారం. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) అక్రమాలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక (Ghosh Commission report), గో సంరక్షణ విధానాలు (cow protection policies), గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు (gig workers welfare bill), రైతుల సమస్యలు (farmers’ problems), ఉచిత కరెంటు (free electricity), రేషన్ కార్డుల (ration cards) జారీ, పంటల బీమా (crop insurance), నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలల(new government junior colleges)కు పోస్టుల కేటాయింపు, MBBS సీట్ల కేటాయింపులో స్థానికత.. తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ కోసం రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.