అక్షరటుడే, హైదరాబాద్, నిజామాబాద్ : Cabinet Expansion | తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి Telangana state cabinet విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. శుక్రవారం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ Mohammad Azharuddin పేరు దాదాపు ఖరారైంది. ఆయనతో పాటు మరో ఇద్దరికి కేబినెట్లో చోటు దక్కే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక్కడి నుంచి మంత్రివర్గం Cabinet లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు.
ఈ నేపథ్యంలో ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో ఒకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశముందని తెలుస్తోంది.
Cabinet Expansion | రెండేళ్లయినా ప్రాతినిధ్యమే లేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినప్పటికీ కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
నిజామాబాద్, హైదరాబాద్ మినహా మిగతా అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు, నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.
కానీ కీలకమైన హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్లో చోటు లేకుండా పోయింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలోనే ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారని భావించినా నిరాశే మిగిలింది.
Cabinet Expansion | జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో..
రాజధాని నగరమైన హైదరాబాద్ నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది. అయితే, నవంబరు 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త రాజకీయ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజవకర్గంలో ఎక్కువగా ఉండే మైనార్టీలను తమ వైపు తిప్పుకొనేందుకు ప్లాన్ వేసింది. అందులో భాగంగానే ఎమ్మెల్సీగా నియమితుడైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది.
తద్వారా మైనార్టీ వర్గానికి కేబినెట్లో చోటు లేదనే భావనను తొలగించడంతో పాటు ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవచ్చనే ఎత్తుగడతో అకస్మాత్తుగా మంత్రివర్గ విస్తరణను చేపట్టింది.
అజార్‌తో పాటు మరో ఇద్దరికి ఛాన్స్..!
ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, డీసీసీ అధ్యక్షుల ఎంపికపై తన ప్రతిపాదనలను హైకమాండ్ ముందుంచారు.
ప్రధానంగా కేబినెట్లోకి ముగ్గురిని తీసుకోవడానికి అనుమతి కోరుతూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్ ఎదుట ప్రతిపాదించారు.
అజారుద్దీన్‌తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో శాసనసభ్యుడి పేరును సూచించినట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్ ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు అజారుద్దీన్ పేరుకు హైకమాండ్ ఆమోదముద్ర వేసింది. మిగతా ఇద్దరి పేర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. నేడో, రేపో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.
పెద్ద దిక్కు లేని ఇందూరు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో వివక్ష కనిపిస్తోంది.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తమ సొంత జిల్లాలకే అగ్రతాంబులం వేస్తున్నారు. మంత్రి లేని ఇందూరు జిల్లాకు పెద్దగా నిధులు రావడం లేదు.
ఇన్‌ఛార్జి మంత్రి చుట్టపు చూపుగా వచ్చిపోవడం తప్ప ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారంచింది లేదు.
ఫలితంగా ప్రజలకు మేలు జరగడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరి కన్నా సీనియర్ అయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఈసారి అమాత్య యోగం దక్కుతుందన్న భావన నెలకొంది.
ఆయనకు కాకపోతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ఛాన్స్ దక్కే అవకాశముంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన జుక్కల్ శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు మాదిగ సామాజికవర్గం కోటాలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

