ePaper
More
    HomeతెలంగాణReservations | కేబినెట్​ నిర్ణయం లీగల్​గా నిలబడదు.. ఎంపీ రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు

    Reservations | కేబినెట్​ నిర్ణయం లీగల్​గా నిలబడదు.. ఎంపీ రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Reservations | బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) కాంగ్రెస్​కు చిత్తశుద్ధి లేదని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు (MP Raghunandan Rao) అన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

    కేబినెట్​ నిర్ణయంపై ఎంపీ రఘునందన్​రావు స్పందించారు. సీలింగ్‌ ఎత్తివేతపై ప్రభుత్వం అవగాహన లేకుండా ముందుకెళ్తోందని విమర్శించారు. ఈ విషయంలో సుప్రీం, హైకోర్టు తీర్పులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సెప్టెంబర్​ 30లోపు సర్పంచ్​ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో.. హడావుడిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. న్యాయపరంగా ఇది నిలబడే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

    Reservations | కాంగ్రెస్​దే బాధ్యత

    బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు అవగాహన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ (Payal Shankar) అన్నారు. ప్రత్యేక జీవోలతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల సీలింగ్​ ఎత్తివేత నిర్ణయంతో న్యాయపరంగా వచ్చే అడ్డంకులకు కాంగ్రెస్​దే బాధ్యత అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు (Local Body Elections) నిర్వహించాలని ఆయన డిమాండ్​ చేశారు.

    Reservations | బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడంతో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పంచాయతీ రాజ్​ చట్టంలో రిజర్వేషన్ల సీలింగ్​ 50 శాతం మించకూడదనే నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది.

    రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా కేబినెట్​ నిర్ణయం కోర్టులో నిలబడే అవకాశం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు రిజర్వేషన్ల బిల్లులను గతంలో ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌కు పంపామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదిస్తామన్నారు.

    Latest articles

    Tea-snacks | టీ తో కలిపి ఈ స్నాక్స్ తింటే, అంతే సంగతులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tea-snacks | టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది ఉదయం, సాయంత్రం టీ తాగే...

    August 31 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం భక్తి

    August 31 Panchangam : తేదీ (DATE) – 31 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Kamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది....

    Lunar eclipse | చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత.. ఎప్పుడంటే..

    అక్షరటుడే, తిరుమల: Lunar eclipse : చంద్ర గ్రహణం రాబోతోంది. సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ...

    More like this