అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు మొదలైన శోభాయాత్ర శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 9 రోజుల పాటు విశేష పూజలందుకున్న వినాయకులను అంగరంగ వైభవంగా ప్రత్యేక వాహనాల్లో నిమజ్జనానికి తరలిస్తున్నారు. శోభాయాత్ర(Ganesh Shobhayatra) రాత్రి 10 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
వివిధ రూపాల్లో ఉన్న గణేశులను, శోభాయాత్రను తిలకించడానికి పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున కామారెడ్డి(Kamareddy)కి చేరుకున్నారు. లక్షలాది మంది రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా నంబర్ సిస్టం తొలగించడంతో గణేశులను ఇష్టానుసారంగా వివిధ రూట్లలో నిమజ్జనానికి తరలిస్తున్నారు. దాంతో శోభాయాత్ర ఆలస్యంగా కొనసాగుతోంది.
శోభాయాత్రను త్వరగా ముగించేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కామారెడ్డి పట్టణం నుంచి శోభాయాత్రగా బయకుదేరిన వినాయకులను టేక్రియాల్ చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. చెరువు వద్ద అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది.
వినాయకులను చెరువులో నిమజ్జనం(Ganesh Immersion) చేసేందుకు రెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. భారీ వినాయకులను క్రేన్ల సాయంతో చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. చిన్న గణపతులను ట్రాక్టర్ నుంచే మున్సిపల్ సిబ్బంది చెరువులో వేస్తున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు ప్రజలు చెరువు వద్దకు భారీగా చేరుకున్నారు. వారి కోసం అధికారులు ప్రత్యేక బారికేడ్లు(Special Barricades) ఏర్పాటు చేశారు.
నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు
టేక్రియాల్ చెరువులో గణనాథులను నిమజ్జనం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
టేక్రియాల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి తిలకించేందుకు వచ్చిన భక్తులు