అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagadish Reddy | పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు (By Elections) వస్తాయని ఆయన పేర్కొన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇటీవల స్పీకర్ నోటీసులు (Speaker Notice) పంపిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, అభివృద్ధి కోసమే సీఎంను కలిసినట్లు నోటీసులకు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో సీఎం కండువా కప్పితే ఏమి అనకలేకపోయామన్నారు. అయితే ఎమ్మెల్యేల వివరణపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Jagadish Reddy | సీఎంను ఎందుకు కలిశారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దీనిపై జగదీశ్‌రెడ్డి స్పందించారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకపోతే.. నోటీసులు రాగానే సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS)లో ఉంటే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎందుకు కలవలేదన్నారు.
Jagadish Reddy | ఎవరూ కాపడలేదు
పెద్ద వరదలో కొట్టుకుపోయేవాడు కనపడ్డ గడ్డి పోసని పట్టుకొని బయట పడదామనుకున్నట్లు ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరు ఉందని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వారిపై వేటు పడటం ఖాయమని, ఉప ఎన్నికలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సదురు ఎమ్మెల్యేల రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కడతారని చెప్పారు. రేవంత్ రెడ్డి కాపాడుతాడని ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని, కానీ వారిని ఎవరూ కాపాడలేరని ఆయన అన్నారు.
Jagadish Reddy | కోర్టుకు వెళ్తాం..
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.