అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Markets | బడ్జెట్ రోజున భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్(domestic stock market).. సోమవారం సైతం భారీ నష్టాల దిశగా సాగింది. అయితే ముడి చమురు ధరలు భారీగా తగ్గడం, రూపాయి విలువ బలపడడంతోపాటు కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పుంజుకున్నాయి. దీర్ఘకాలిక దష్టితో బడ్జెట్‌ను విశ్లేషించినవారు వాల్యూ బయ్యింగ్‌కు దిగడంతో సూచీలు పరుగులు తీశాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 167 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా తేరుకుని 656 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి మరోసారి అమ్మకాల ఒత్తిడితో 824 పాయిట్లు కోల్పోయింది. నిఫ్టీ నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 146 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 263 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.30 గంటల తర్వాత సూచీలు పుంజుకున్నాయి. కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,345 పాయింట్లు, నిఫ్టీ (Nifty) 429 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 81,666 వద్ద, నిఫ్టీ 262 పాయింట్ల లాభంతో 25,088 వద్ద స్థిరపడ్డాయి.
Indian Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,039 కంపెనీలు లాభపడగా 2,220 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 76 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 360 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Indian Markets | రాణించిన యుటిలిటీ, పవర్ రంగాలు..
ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. యుటిలిటీ, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, రియాలిటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు రాణించాయి.
Indian Markets | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. పవర్‌గ్రిడ్ 7.61 శాతం, అదానిపోర్ట్స్ 4.76 శాతం, బీఈఎల్ 3.33 శాతం, రిలయన్స్ 3.28 శాతం, ఎంఅండఎం 2.86 శాతం లాభపడ్డాయి.
Indian Markets | Top losers..
యాక్సిస్ బ్యాంక్ 2 శాతం, ఇన్ఫోసిస్ 1.85 శాతం, టీసీఎస్ 0.52 శాతం, ట్రెంట్ 0.47 శాతం, టైటాన్ 0.27 శాతం నష్టపోయాయి.