అక్షరటుడే, వెబ్డెస్క్ :Buttermilk | ఎండాకాలంలో గొంతు తడుపుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి అందరూ మజ్జిగ తాగుతుంటారు. మజ్జిగ తాగిన తర్వాత శరీరం చల్లగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ మజ్జిగను అందరూ తాగడం మంచిది కాదు. ప్రధానంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు మజ్జిగ తాగడం హానికరం. పాల ఎలర్జీ ఉన్న వారు, హైబీపీ(High blood pressure)తో బాధ పడుతున్న వారు, కిడ్నీ రోగులు, అసిడిటీ సమస్య(Acidity problems)లతో బాధ పడుతున్న వారు మజ్జిగకు దూరంగా ఉండడం ఉత్తమం.
Buttermilk | ఎందుకంటే..
మజ్జిగ తీసుకోవడం వల్ల కలిగే కొందరిలో కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయి. మజ్జిగలో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల లాక్టోస్ అసహనం ఉన్నవారికి జీర్ణం కావడం కష్టమవుతుంది. దీని వలన ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు(Gastric problems), కడుపు నొప్పి వంటివి వస్తాయి. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ గట్ ఫ్లోరాలో అంతరాయం కలిగిస్తాయి, ఫలితంగా విరేచనాలు లేదా మలబద్ధకం వస్తుంది. మజ్జిగను ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మజ్జిగలో టైరమైన్(Tyramine) కూడా ఉంటుంది. సున్నితంగా ఉండే వ్యక్తులలో మైగ్రేన్, తలనొప్పికి కారణమవుతుంది.
Buttermilk | ఎవరు తీసుకోవద్దంటే..
పాల ఎలర్జీ ఉన్న వారు, హైబీపీతో బాధ పడుతున్న వారు, కిడ్నీ రోగులు, అసిడిటీ సమస్యలతో బాధ పడుతున్న వారు మజ్జిగ(Buttermilk)కు దూరంగా ఉండడం ఉత్తమం. పాలు తాగడం వల్ల ప్రతిచర్యలు ఉత్పన్నమయ్యే వారు ఎప్పుడూ మజ్జిగను తాగకూడదు. ఎందుకంటే వారు మజ్జిగను తాగినప్పుడు వారికి అది తెలియదు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా, వారి శరీరంపై మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇక అధిక రక్తపోటుతో బాధ పడుతున్న వారు కూడా మజ్జిగకు దూరంగా ఉండాలి. మజ్జిగలో ఉప్పు కలుపుతారు. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి హానికరం అని నిరూపితమైంది కాబట్టి హైబీపీతో బాధ పడే వారు మజ్జిగను తాగేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మజ్జిగలో పొటాషియం, భాస్వరం ఉంటాయి, ఇవి మూత్రపిండ రోగులకు మంచిది కాదు. అందువల్ల, వారు మజ్జిగను తాగకూడదు. అసిడిటీ రోగులు మజ్జిగకు దూరంగా ఉండాలి, ఎందుకంటే వారు మజ్జిగను తాగితే, అది వారి ఆరోగ్యానికి హానికరం అని నిరూపితమైంది.