HomeUncategorizedAndhra Pradesh | చెల్లికి ఆస్తి ఇచ్చారని తల్లిదండ్రులను ట్రాక్టర్​తో ఢీకొట్టి చంపిన కసాయి కొడుకు

Andhra Pradesh | చెల్లికి ఆస్తి ఇచ్చారని తల్లిదండ్రులను ట్రాక్టర్​తో ఢీకొట్టి చంపిన కసాయి కొడుకు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Andhra Pradesh : ఆధునిక సమాజంలో బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. డబ్బులు, ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వారినే కడతేర్చుతున్నారు.

ముఖ్యంగా తోబుట్టువులు, తల్లిదండ్రులనే పట్టించుకోకపోవడం అటుంచి, వారినే కిరాతకంగా వధిస్తున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్​లో మరో దారుణం చోటుచేసుకుంది. చెల్లికి ఆస్తి రాసిచ్చారని తల్లిదండ్రులను ఓ దుర్మార్గుడు ట్రాక్టర్​తో అతికిరాతకంగా ఢీకొట్టి కడతేర్చాడు. బుడి బుడి  అడుగులు వేయించిన తల్లినే హత మార్చాడు. భుజాన ఎత్తుకుని లోకం చూపించిన తండ్రిని ఈ లోకం నుంచే భయానకంగా పరలోకానికి సాగనంపాడు.

విజయనగరం Vizianagaram జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో అప్పలనాయుడు(55), జయ (45) దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిని ఇరువురికి ఇచ్చారు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడం పుత్రరత్నం రాజశేఖర్​కి నచ్చలేదు. దీంతో తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయమై వారి మధ్య తరచూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుమార్తెకు ఇచ్చిన భూమిని శనివారం(ఏప్రిల్​ 26) రాజశేఖర్ ట్రాక్టర్​తో చదును చేస్తున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కుమారుడిని వారించారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్..​ ట్రాక్టర్​తో వారిని ఢీకొట్టి చంపేశాడు.