అక్షరటుడే, హైదరాబాద్: baby Girl : ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్‌లో greater hyderabad city చోటు చేసుకుంది.
నేపాల్‌కు nepali family చెందిన జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు గోల్కొండ పోలీస్ స్టేషన్ golkonda police station పరిధిలోని ఓ అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా.. ఇటీవలే కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు.
కాగా, 14 రోజుల క్రితం గౌరీ ఆడపిల్లకు జన్మిచ్చింది. అయితే, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పసికందును తండ్రి జగత్ బయటకు తీసుకువెళ్లాడు. కత్తితో ఆ పసికందు గొంతుకోసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు.
కాసేపటి తర్వాత నిద్ర లేచిన గౌరీ.. పాప ఎక్కడని నిలదీయగా.. చంపేసి గోనె సంచిలో పెట్టానని జగత్ చెప్పాడు. దీంతో గౌరీ భయంతో సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లింది. అదే అదనుగా భావించిన జగత్ మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. గౌరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, జగత్‌ను అదుపులోకి తీసుకున్నారు.