ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | కార్లతో యువకుల హల్​చల్​

    Hyderabad | కార్లతో యువకుల హల్​చల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నా చాలా మంది ట్రాఫిక్​ నిబంధనలు(Traffic Rules) పాటించడం లేదు. పలువురు యువత ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెడుతున్నారు. రీల్స్​ కోసం కొందరు వాహనాలతో స్టంట్లు చేస్తున్నారు. మరికొందరు యువకులు రోడ్లపై ర్యాష్​ డ్రైవింగ్ (Rash Driving)​ చేస్తూ అదో గొప్ప పని ఫీల్​ అవుతున్నారు. హైదరాబాద్​ (Hyderabad)లో శనివారం రాత్రి పలువురు యువకులు కార్లతో హల్​చల్​ చేశారు.

    హైదరాబాద్​ నగరంలోని హైటెక్​సిటీ (Hitech City)లో పలువురు లగ్జరీ కార్లతో ర్యాష్​ డ్రైవింగ్​ చేశారు. నీలోఫర్ కేఫ్ వద్ద కార్లతో స్టంట్లు చేశారు. అతివేగంగా నడుపుతూ.. పోటాపోటీగా డ్రిఫ్టులు కొడుతూ ఆకతాయిలు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఓ కారు అదుపు తప్పి పార్కింగ్ చేసిన ఉన్న రెండు కార్లను ఢీకొంది. దీంతో డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....