HomeతెలంగాణNizamabad City | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న వ్యాపార సంస్థలు.. పలువురికి జైలుశిక్ష

Nizamabad City | అర్ధరాత్రి వరకు తెరిచి ఉన్న వ్యాపార సంస్థలు.. పలువురికి జైలుశిక్ష

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:Nizamabad City | అర్ధరాత్రి వరకు పలు దుకాణాలు తెరిచిఉంచిన యజమానులకు న్యాయస్థానం (nizamabad Court) జైలుశిక్ష విధించింది.

ఒకటో టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి(1 town SHO Ragupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పోలీసుకు రోజువారీ తనిఖీలు చేపట్టారు. వీక్లిమార్కెట్​లోని రెయిన్​బో బార్​, వైష్ణవి టిఫిన్​ సెంటర్​, మాలపల్లిలోని ఫ్రూట్​మార్కెట్​ వద్ద పాన్​షాప్​ నిర్వాహకులు అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచినట్లు గుర్తించారు. సంబంధిత యజమానులను అదుపులోకి తీసుకుని సెకండ్​క్లాస్​ మెజిస్ట్రేట్​(Second Class Magistrate) ఎదుట హాజరుపర్చగా ముగ్గురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.