అక్షరటుడే, పెద్దకొడప్గల్: TGSRTC | బస్సు అద్దాలను ధ్వంసం చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో (Peddakodapgal mandal) శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో హైదరాబాద్ డిపోకు (Hyderabad depot) చెందిన బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. చిన్నకొడప్గల్ వద్ద ఆపాలని కోరారు. అయితే ఈ బస్సు చిన్నకొడప్గల్ వద్ద ఆగదని కండక్టర్ పేర్కొన్నాడు.
దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు బస్సు వెనక అద్దాలను ధ్వంసం చేశాడు. దీంతో అతడిని పట్టుకున్న స్థానికులు పోలీసులు అప్పజెప్పారు. బస్ కండక్టర్ కేతావత్ రాందాస్ ఫిర్యాదు మేరకు యువకుడు కుమ్మరి శంకర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.