అక్షరటుడే, బాన్సువాడ: Banswada | జుక్కల్ మండలంలోని (Jukkal mandal) సావర్గావ్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌కు (RTC depot manager Ravikumar) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టూడెంట్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇటీవల సావర్గావ్ గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఖండేబల్లూరు ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారన్నారు. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడని వారు పేర్కొన్నారు. సావర్గావ్, విఠల్వాడి, బాబుల్‌గావ్, కరంజి గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులకు ఆటోలు తప్ప వేరే మార్గం లేదన్నారు. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, అత్యవసరంగా ఆయా ప్రాంతాలకు బస్సు నడపాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ పరిషత్ బాన్సువాడ డివిజన్ నాయకులు సంతోష్, విక్రమ్, సురేష్ పాల్గొన్నారు.