అక్షరటుడే, పెద్ద కొడప్గల్: Bus inspections | రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు బస్సు తనిఖీలు చేస్తున్నామని పెద్దకొడప్గల్ ఎస్సై అరుణ్‌కుమార్ (Pedda Kodapgal SI Arun Kumar) పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పలు ప్రైవేట్ స్కూల్ బస్సులను (private school buses) ఆయన తన సిబ్బందితో తనిఖీ చేశారు.
బస్సు డ్రైవర్లకు (bus drivers) డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బస్సులో ప్రయాణం చేసే సమయంలో డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా వాహనాలను నడపాలన్నారు. జాతీయ రహదారి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఫిట్నెస్ తప్పక ఉండాలని ఆదేశించారు. లేకపోతే బస్సులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
