అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viral Video | భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ Virat Kohli క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఆటతోనే కాదు, బయట కనిపించినా చాలు కెమెరాలు అన్నీ ఆయన వైపే తిరుగుతాయి.
చాలా ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీని చూడటానికి అభిమానులు ఎగబడుతుండగా, విజయ్ హజారే ట్రోఫీలో కింగ్ కోహ్లీ సందడి మామూలుగా లేదు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy) ఆడుతున్న కోహ్లీని వీడియో తీయడానికి ఢిల్లీ టీమ్ బస్సు డ్రైవర్ (Delhi team bus driver) చేసిన ఓ వెరైటీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కోహ్లీకి తెలియకుండా వీడియో రికార్డ్ చేయడానికి అతడు ఉపయోగించిన ట్రిక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Viral Video | ఏమిటా డ్రైవర్ ట్రిక్?
శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఈ వీడియో బయటకు వచ్చింది. బస్సు డ్రైవర్ (Bus Driver) తన మొబైల్ ఫోన్‌ను పక్కన ఓ చోట సెట్ చేసి పెట్టి, తాను డ్రైవింగ్ సీటులో సీరియస్‌గా కూర్చున్నట్లు నటించాడు. అదే సమయంలో వెనుక నుంచి విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మతో పాటు ఇతర టీమ్ మెంబర్స్ బస్సు దిగుతుండగా, అందరూ ఒకే ఫ్రేమ్‌లో పడేలా వీడియో రికార్డ్ అయ్యింది. ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవర్ మెయింటైన్ చేసిన ఆ ‘సీరియస్ ఎక్స్ప్రెషన్’ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలకే పరిమితం కాకుండా, తన బ్యాట్‌తో Bat కూడా కోహ్లీ అదరగొడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 101 బంతుల్లో 131 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. గుజరాత్‌పై 77 పరుగులు చేయడంతో విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 208 పరుగులు (సగటు 104) సాధించిన కోహ్లీ, మరోసారి ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అని నిరూపించాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ప్రస్తుతం కోహ్లీ ముంబైకి చేరుకున్నాడు.
Today’s best video. ❤️😁
A bus driver found the smartest way to record Virat Kohli while he was getting off the team bus, phone steady, body frozen, zero reaction. Man stayed in character for 30 seconds to record Virat 🤣 pic.twitter.com/p8SWUMsP6F
— Vipin Tiwari (@Vipintiwari952) December 26, 2025