అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | నందిపేట మండలంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో (assembly sessions) భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. 1998లో ఇంటింటికి రూ.5 చొప్పున డబ్బులు జమ చేసి ఐదున్నర ఎకరాల స్థలం బస్ డిపో కోసం కొనిచ్చారని వివరించారు. అప్పటి రవాణా శాఖ మంత్రి కేసీఆర్ (KCR) శంకుస్థాపన సైతం చేశారన్నారు. ఏళ్లు గడుస్తున్నా.. బస్ డిపో కలగానే మిగిలిపోయిందని చెప్పారు.
Mla Rakesh Reddy | బస్టాండ్ కోసం హైకోర్టుకు..
ప్రస్తుతం బస్టాండ్ స్థలం కోసం గ్రామస్థులు హైకోర్టును (High Court) ఆశ్రయించారని తెలిపారు. ఉత్తర తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఖుద్వాన్పూర్ గ్రామంలో ఎస్సీ, బీసీ హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో మైనారిటీల స్కూల్ భవనం శిధిలావస్థలో ఉందని విరవించారు. నందిపేట మండలం కంఠం గ్రామ పాఠశాలలో బాలికలకు మూత్రశాల లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెండేళ్లుగా నిధుల విషయమై మంత్రులకు విన్నవిస్తే సరే అంటున్నారే తప్ప ఒక్కరూ నిధులిచ్చింది లేదని ఆయన వాపోయారు.