Homeక్రైంRajasthan | బస్సులో మంటలు.. 15 మంది సజీవ దహనం

Rajasthan | బస్సులో మంటలు.. 15 మంది సజీవ దహనం

Rajasthan | రాజస్థాన్​లోని జైసల్మేర్​లో ప్రైవేట్​ బస్సు దగ్ధం అయింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rajasthan | రాజస్థాన్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్​ బస్సు (Private Bus)లో మంటలు చెలరేగడంతో 15 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

రాజస్థాన్​ రాష్ట్రంలోని జైసల్మేర్‌ (Jaisalmer)లో మంగళవారం బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తైయాట్‌ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్​ బస్సు జైసల్మేరు నుంచి జోద్​పూర్​ వెళ్తుండగా.. జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్​ బస్సును రోడ్డు పక్కన ఆపాడు. అయితే అప్పటికే మంటలు బస్సు అంతటా వ్యాపించాయి.

Rajasthan | బస్సులో 57 మంది ప్రయాణికులు

ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మంటలు వ్యాపించగానే పక్కనే ఉన్న ఆర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.