అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Report | దేశంలో వాతావరణం భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండల దాటికి ప్రజలు అల్లాడున్నారు.
ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఢిల్లీలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో 45 నుంచి 49 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Weather Report | దక్షిణాదిలో గాలివానల బీభత్సం
దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. ఉపరితల ఆవర్తన ధ్రోణి కారణంగా తెలంగాణ(Telangana)లో మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.