Homeజిల్లాలుకామారెడ్డిBJP Leaders | సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

BJP Leaders | సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జూబ్లీహిల్స్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట : BJP Leaders | లింగంపేట (Lingampet) మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ (BJP) నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి  (CM Revanth Reddy) ఆపరేషన్ సిందూర్​ను అపహాస్యం చేసే విధంగా మాట్లాడారన్నారు.

దేశ సమగ్రత, సైనికులను కించపరిచే విధంగా సీఎం మాట్లాడారన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. లేకపోతే సీఎం ఇంటిని, క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు జక్సాని దత్తు రాములు, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచంద్ర చారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రాజారాం బాలయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు రజనీకాంత్, దురిశెట్టి రవి, అనిల్ కుమార్, శివన్నగారి నవీన్ కుమార్, రాజారామ్ తల్వార్ సాయిలు, రాకేష్, అశోక్, సాయిలు పాల్గొన్నారు.

BJP Leaders | బాన్సువాడలో బీజేపీ రాస్తారోకో

అక్షరటుడే, బాన్సువాడ: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)​, దేశ సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చీదర్ సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ, గుడుగుట్ల శ్రీనివాస్, ఉమేష్, గజ్జల మహేష్, సిద్ది బాలరాజ్, చీకట రాజు, కొండని గంగారాం, పాశం భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, నాగరాజ్, ప్రణయ్ సాయి రెడ్డి పాల్గొన్నారు.