Hyderabad
Hyderabad | పెట్టుబడుల పేరిట బురిడీ.. రూ.600 కోట్లు కాజేసిన మహిళా.. సంధ్యారాణి కేసులో కీలక విషయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లో రూ.600 కోట్లు కాజేసిన మహిళా కేసులో (Women Case) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పెట్టుబడుల పేరిట ప్రముఖులే లక్ష్యంగా ఆమె మోసాలకు పాల్పడింది.

సంధ్యారాణి (Sandhya Rani) అనే మహిళ వందల మందిని మోసం చేసింది. గార్మెంట్ వ్యాపారంలో పెట్టుబడులు అని చెప్పి డబ్బులు వసూలు చేసింది. తక్కువ ధరకు భూములు ఇప్పిస్తానని నమ్మించింది. ఇలా ఏకంగా రూ.600 కోట్ల మోసానికి పాల్పడింది.

Hyderabad | ప్రముఖులే టార్గెట్​

సంధ్యారాణి నగరంలోని ఒక గేటెడ్​ కమ్యూనిటీలో నివాసం ఉండేది. భారీగా డబ్బు సంపాదించాలనే ఆశతో మోసాల బాట పట్టింది. ఉద్యోగులు, వ్యాపారులు, ప్రముఖులను (businessmen and celebrities) లక్ష్యంగా చేసుకుంది. గార్మెంట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించింది. ఇలా ఒక గేటేడ్​ కమ్యూనిటీలో ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర డబ్బులు వసూలు చేసింది. ఇలా రూ.300 కోట్లు వసూలు చేసింది. అయితే పలువురు వ్యాపారులు తమ పరువు పోతుందని మోసపోయిన విషయం బయటకు చెప్పడం లేదు.

Hyderabad | ఖాళీ స్థలాలు చూపి..

సంధ్యారాణి, గంగాధర్​ ఇద్దరు కలిసి మోసాలకు పాల్పడ్డారు. ఖాళీ స్థలాలను చూపి అక్కడ కమర్షియల్ భవనాలు (commercial buildings) కడుతున్నామని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. స్థలాలు, గార్మెంట్​ వ్యాపారంలో పెట్టుబడుల పేరిట రూ.600 కోట్లు వసూలు చేశారు. వీరు మోసాలు చేయడానికి ఏకంగా ఏకంగా 40 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. సంఘ‌సేవ‌కురాలికిగా చెప్పుకుంటూ ఆమె చాలా మందికి టోకరా వేసింది. త‌వ్వేకొద్దీ ఆమె మోసాలు వెలుగు చూస్తున్నాయి. భ‌క్తి పేరుతో వ్యాపారుల‌కు సంధ్యారాణి ప్రసాదాలు పంపిణీ చేసేది. అనంతరం వారితో పరిచయం పెంచుకొని పెట్టుబడుల (investments) పేరిట డబ్బులు వసూలు చేసింది.

Hyderabad | క్యూ కట్టిన బాధితులు

సంధ్యారాణి చేతిలో మోసపోయిన వైజాగ్‌కు చెందిన దొరైరాజు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు (Hyderabad CCS police) ఫిర్యాదు చేయడంతో ఆమె మోసాలు బయటకు వచ్చాయి. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పెట్టుబడులు పెట్టిన వారు డబ్బులు అడుగుతుండటంతో ఆమె దుబాయి (Dubai) పారిపోవాలని ప్లాన్​ వేసింది. ఈ క్రమంలో పోలీసులు సంధ్యారాణిని అరెస్ట్ చేశారు. అయితే ఆమె చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు.