Homeక్రీడలుBumrah | కపిల్ సరసన బూమ్రా.. విదేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన క్రికెటర్ గా...

Bumrah | కపిల్ సరసన బూమ్రా.. విదేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన క్రికెటర్ గా రికార్డు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bumrah : భారత పేసర్ జస్ ప్రీత్ బూమ్రా (Indian pacer Jasprit Bumrah) సరికొత్త రికార్డు సాధించాడు. విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 12 సార్లు 5 వికెట్లు తీసిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు.

లార్డ్స్ టెస్టులో బూమ్రా ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ (England) తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజైన శుక్రవారం ఈ పేస్ బౌలర్ రెచ్చిపోయాడు. హ్యారీ బ్రూక్ Harry Brook, బెన్ స్టోక్స్ Ben Stokes, జో రూట్ Joe Root, క్రిస్ వోక్స్ Chris Woakes , జోఫ్రా ఆర్చర్ Jofra Archer వికెట్లు పడగొట్టడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పాడు.

Bumrah : విదేశాల్లో 12 సార్లు..

విదేశీ గడ్డపై అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్ గా బూమ్రా కపిల్ దేవ్ Kapil Dev సరసన చేరాడు. ఆస్ట్రేలియా Australia, ఇంగ్లాండ్ లపై 4 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే, దక్షిణాఫ్రికా South Africa పై 3 సార్లు, వెస్టిండీస్ పై రెండు సార్లు ఈ ఫీట్ ను సాధించాడు. విదేశాల్లో మొత్తంగా 12 సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో బూమ్రా అద్భుతంగా రాణించాడు. హెడింగ్లీలో జరిగిన సిరీస్ తొలి టెస్టులో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్ట్ నుంచి బూమ్రా విశ్రాంతి లభించింది. లార్డ్స్ టెస్టు తో తిరిగి జట్టులోకి వచ్చి ఈ పేస్ బౌలర్.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లిష్ జట్టు రెండో రోజు ఆరు వికెట్లు కోల్పోగా, అందులో ఐదింటిని బూమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

Bumrah : వరల్డ్ రికార్డు..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్​లో భారతదేశం తరఫున అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్​ను బుమ్రా అధిగమించాడు. అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్ట్ లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత బుమ్రా అతనితో సమంగా నిలిచాడు. ఇప్పుడు లార్డ్స్ లో మరోసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించి అశ్విన్​ను అధిగమించాడు.