అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reliance Jio | ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారుల కోసం వరుసగా కొత్త ప్లాన్‌లు విడుదల చేస్తూ పోటీలో ముందంజలో నిలుస్తోంది.
మొబైల్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఆస్వాదించాలనుకునే కస్టమర్ల కోసం జియో ఇప్పుడు హాట్‌స్టార్‌తో కలిపిన ప్రీపెయిడ్ ఆఫర్‌లను అతి తక్కువ ధరల్లో అందిస్తోంది. డేటా, కాలింగ్‌తో పాటు OTT సబ్‌స్క్రిప్షన్‌ను (OTT subscription) కూడా ఒకే ప్లాన్‌లో ఇస్తుండడం వినియోగదారులకు గొప్ప ప్రయోజనంగా మారింది.
- రూ. 355 ప్లాన్ – హాట్‌స్టార్‌తో బడ్జెట్ ఆఫర్
- రూ.355 రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు ఈ కీలక బెనెఫిట్స్ పొందొచ్చు:
- డిస్నీ+ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్
- అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్
- 25GB డేటా (30 రోజుల వాలిడిటీ)
- రోజుకు 100 SMSలు
- JioTV, JioAICloud (50GB స్టోరేజ్)
- JioHome 2 నెలల ఉచిత ట్రయల్
- అర్హులైన వినియోగదారులకు Google Gemini Pro 18 నెలలు ఫ్రీ యాక్సెస్
- క్రికెట్, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు Web series మొబైల్‌లో చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ బడ్జెట్ ప్లాన్.
- రూ. 799 ప్లాన్ – 84 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ప్రతి నెలా రీచార్జ్ చేయాలనిపించని వారికి రూ.799 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో కలిగే ప్రయోజనాలు:
- 84 రోజుల వాలిడిటీ
- రోజుకు 1.5GB డేటా
- అపరిమిత కాలింగ్
- రోజుకు 100 SMSలు
- జియో హాట్‌స్టార్, JioTV, JioAICloud యాక్సెస్
ఎక్కువరోజులు డేటా+ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునే యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను జియో ప్రత్యేకంగా రూపొందించింది.
జియో Jio తీసుకొస్తున్న ఈ ఆఫర్‌లు OTT కంటెంట్‌ను తక్కువ ఖర్చులో ఆస్వాదించాలనుకునే వారికి మంచి అవకాశంగా మారాయి.
