Homeబిజినెస్​Stock Makert | బుల్స్‌ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Stock Makert | బుల్స్‌ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Makert | యూఎస్‌ టారిఫ్‌ భయాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మొదట ఒడిదుడుకులకు లోనైనా.. తర్వాత బుల్స్‌ పైచేయి సాధించడంతో సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ తిరిగి 80 వేల పాయింట్ల మార్క్‌పైకి చేరింది. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 28 పాయింట్లు, నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. తొలి గంటపాటు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఇంట్రాడే(Intraday)లో సెన్సెక్స్‌ 79,772 పాయింట్ల కనిష్టానికి, నిఫ్టీ 24,347 పాయింట్ల కనిష్టానికి పడిపోయాయి. ఆ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో తేరుకుని లాభాలబాటపట్టాయి.

ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్‌ 864 పాయింట్లు, నిఫ్టీ 253 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్‌ 746 పాయింట్ల లాభంతో 80,604 వద్ద, నిఫ్టీ(Nifty) 221 పాయింట్ల లాభంతో 24,585 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడం, యూఎస్‌ సుంకాల భయంతో తగ్గిన షేర్ల ధరలు ఆకర్షణీయంగా కనిపించడం, క్రూడ్‌ ఆయిల్‌ ధర దిగివస్తుండడం, యూఎస్‌, రష్యా అధినేతల భేటీతో జియో పొలిటికల్‌ టెన్షన్స్‌(Geo political tensions) తగ్గే అవకాశాలు ఉంటాయన్న అంచనాలు వంటి కారణాలతో మన మార్కెట్లు పెరిగాయి.

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,237 కంపెనీలు లాభపడగా 1,930 స్టాక్స్‌ నష్టపోయాయి. 170 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 122 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 161 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.40 లక్షల కోట్లు పెరిగింది.

Stock Makert | అన్ని రంగాల స్టాక్స్‌లో ర్యాలీ..

కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌(Consumer durables) మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు ర్యాలీ తీశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, రియాలిటీ, ఇన్‌ఫ్రా, బ్యాకింగ్‌ రంగాల షేర్లు పరుగులు తీశాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ 2.19 శాతం పెరగ్గా.. రియాలిటీ 1.86 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లు 1.37 శాతం, బ్యాంకెక్స్‌ 1.13 శాతం, హెల్త్‌కేర్‌ 1.12 శాతం, పీఎస్‌యూ 1.07 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.03 శాతం పెరిగాయి. కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ మాత్రమే 0.46 శాతం మేర నష్టపోయింది. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.97 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.79 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం లాభాలతో ముగిశాయి.

Stock Makert | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 27 కంపెనీలు లాభాలతో, 3 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్‌ 3.24 శాతం, ఎటర్నల్‌ 2.84 శాతం, ట్రెంట్‌ 2.49 శాతం, ఎస్‌బీఐ 2.45 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.95 శాతం లాభాలతో ముగిశాయి.

Stock Makert | Losers..

బీఈఎల్‌ 0.20 శాతం, ఎయిర్‌టెల్‌ 0.09 శాతం, మారుతి 0.02 శాతం నష్టపోయాయి.

Must Read
Related News