అక్షరటుడే, వెబ్డెస్క్ : Kothapet MLA | ప్రజాప్రతినిధులు రైతులను ఆకట్టుకోవడానికి అప్పుడప్పులు ఎడ్ల బండ్లపై ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు (MLAs and MPs) సైతం ఎడ్ల బండ్లపై ఎక్కి ఫొటోలకు ఫోజులు ఇస్తారు. అయితే కొన్ని ఎడ్లు ఎక్కువ మందిని చూసి బెదురుతుంటాయి. ఇలాంటి సమయంలో ప్రచారం కోసం ఎడ్ల బండ్లు ఎక్కిన నాయకులు ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఓ ఎమ్మెల్యే ఎడ్లబండిపై నుంచి పడిపోయాడు.
ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు (welfare schemes) అమలు చేస్తోందని కూటమి నాయకులు చెబుతున్నారు. ఇటీవల రైతు భరోసా (Rythu Bharosa) డబ్బులను ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema district) ఆలమూరులో బుధవారం రైతు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు (Kothapet MLA Bandaru Satyananda Rao) హాజరయ్యారు.
Kothapet MLA | నినాదాలు చేయడంతో..
ఆలమూరులో రైతు సంబరాలకు హాజరైన ఎమ్మెల్యే ఎడ్లబండిపైకి ఎక్కాడు. ఆయన కోసం ముందుగానే టీడీపీ నేతలు (TDP leaders) ఎడ్లబండిని ముస్తాబు చేశారు. అనంతరం ఆయన బండిపై ఎక్కిన తర్వాత నాయకులు ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ (Super Six – Super Hit) అని నినాదాలు చేశారు. ఒక్కసారిగా నినాదాలు చేయడంతో ఎడ్లు బెదిరాయి. దీంతో అటుఇటు పరుగులు పెట్టడంతో బండిపై నుంచి ఎమ్మెల్యే సత్యానంద రావు కిందపడిపోయారు. అదృష్టవశాత్తు ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు. బండిపై ఉన్న పలువురు టీడీపీ నాయకులు సైతం గాయపడ్డారు.
టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు
సూపర్ సిక్స్ సూపర్ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే బెదిరిన ఎడ్లు.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో నిర్వహించిన రైతు సంబరాల్లో ఎడ్లు బెదిరిపోవడంతో ఎడ్లబండిపై నుంచి కిందపడిపోయియిన టీడీపీ కొత్తపేట… pic.twitter.com/kZ2WMDcT2o
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025