అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) గురువారం తొలి అర్ధభాగం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగినా రెండో అర్ధభాగంలో బుల్ జోరుతో పరిస్థితి మారిపోయింది. భారీ లాభాలతో ప్రధాన సూచీలు ముగిశాయి. ఉదయం 24 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. అమ్మకాల ఒత్తిడితో 677 పాయింట్లు పడిపోయింది. 28 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. ప్రారంభంలోనే రెండువందలకుపైగా పాయింట్లు క్షీణించింది. మధ్యాహ్న 1 గంట తర్వాత కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కోలుకుని భారీ ర్యాలీ తీశాయి. చివరికి సెన్సెక్స్ 1,200 పాయింట్ల లాభంతో 82,530 వద్ద, నిఫ్టీ(Nifty) 395 పాయింట్ల లాభంతో 25,062 వద్ద ముగిశాయి. నిఫ్టీ 25 వేల మార్క్‌ను దాటడం గతేడాది అక్టోబర్ 17 తర్వాత ఇదే మొదటి సారి కావడం గమనార్హం. గురువారం నాటి బుల్ ర్యాలీ(Bull rally)తో ఆల్‌టైం హైకి సెన్సెక్స్ 34 వందల పాయింట్ల దూరంలో, నిఫ్టీ 12 వందల పాయింట్ల దూరంలో నిలిచాయి. భారత్(Bharath), పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతుండడం, మన కంపెనీల క్యూ4 ఫలితాలు ఆశించినదానికన్నా మెరుగ్గా ఉండడంతో చైనా కన్నా భారత్ మార్కెట్లే సేఫ్ బెట్ అని విదేశీ సంస్థాగత మదుపరులు భావిస్తుండడం, క్రూడ్ ఆయిల్ ధరలు దిగివస్తుండడం, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలూ తొలగిపోతుండడం వంటి కారణాలతో మన సూచీలు రాణించాయి. యూఎస్(US), యూరోప్‌తోపాటు ఆసియా మార్కెట్లన్నీ నెగెటివ్‌గా ఉన్నా మన సూచీలు మాత్రం విశేషంగా రాణించడం గమనార్హం.
బీఎస్‌ఈ(BSE)లో 2,637 కంపెనీలు లాభపడగా 1,327 స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. 150 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 92 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 28 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 12 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 4.5 లక్షల కోట్లకుపైగా పెరిగింది.
Stock Market | రాణించిన లార్జ్ క్యాప్ స్టాక్స్
అన్ని రంగాల షేర్లూ రాణించాయి. గురువారం స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ కన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్ విశేషంగా రాణించడం గమనార్హం. లార్జ్‌క్యాప్(Large cap) ఇండెక్స్ 1.49 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం పెరిగాయి. బీఎస్‌ఈ రియాలిటీ ఇండెక్స్ 1.87 శాతం, ఆటో(Auto) సూచీ 1.86 శాతం, మెటల్ ఇండెక్స్ 1.68 శాతం లాభపడ్డాయి. ఇన్‌ఫ్రా ఇండెక్స్ 1.41 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.29 శాతం పెరగ్గా.. ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ(IT), ఎనర్జీ, బ్యాంకెక్స్, టెలికాం ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభాలతో ముగిశాయి. పవర్, కన్జూమర్ డ్యూరెబుల్, పీఎస్‌యూ షేర్లలోనూ బుల్ ర్యాలీ కంటిన్యూ అయ్యింది.
Stock Market | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 29 కంపెనీలు లాభాలతో ముగియగా.. ఒక్క కంపెనీ మాత్రమే నష్టాలతో ముగిసింది. టాటా మోటార్స్(Tata motors) 4.16 శాతం పెరగ్గా.. హోచ్‌సీఎల్ టెక్ 3.56 శాతం, అదాని పోర్ట్స్, ఎటర్నల్, మారుతి, రిలయన్స్(Reliance), ఆసియా పెయింట్ రెండు శాతానికిపైగా పెరిగాయి.
Stock Market | నష్టాల్లో ఒకే ఒక్కటి..
బీఎస్‌ఈ 30 ఇండెక్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్(Indusind bank) మాత్రమే నష్టాలతో ముగిసింది. 0.16 శాతం నష్టపోయింది.
