Homeబిజినెస్​Stock Market | మార్కెట్‌లో బుల్‌ జోరు.. ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

Stock Market | మార్కెట్‌లో బుల్‌ జోరు.. ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

బుల్‌ జోరుతో బ్యాంక్‌ నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయికి చేరింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు సైతం జీవనకాల గరిష్టాలకు సమీపంలో ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో (Domestic Stock Market) బెంచ్‌ మార్క్‌ సూచీలు వారాంతాన్ని బలహీనంగా ప్రారంభించినా.. కొద్దిసేపటికే కోలుకున్నాయి. ఆ తర్వాత జీవనకాల గరిష్టాల దిశగా దూసుకుపోయి వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 136 పాయింట్లు, నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మొదట్లో కాసేపు అమ్మకాల ఒత్తిడి కనిపించినా తర్వాత కోలుకుని ఆల్‌టైం హై దిశగా సాగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 84 వేల మార్క్‌ను దాటింది. ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్‌ 83,206 నుంచి 84,172 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,508 నుంచి 25,781 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 484 పాయింట్ల లాభంతో 83,952 వద్ద, నిఫ్టీ (Nifty) 124 పాయింట్ల లాభంతో 25,709 వద్ద స్థిరపడ్డాయి. కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికన్నా బాగుండడం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడుతుండడంతో ఎఫ్‌ఐఐలు (FII) ఇండియన్‌ మార్కెట్‌లో తిరిగి నెట్‌ బయ్యర్లుగా మారుతుండడం, హెవీవెయిట్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు వంటి కారణాలతో సూచీలు పెరిగాయి. ఈ క్రమంలో బ్యాంక్‌ నిఫ్టీ(Bank nifty) 57,830 వద్ద లైఫ్‌టైం హై స్థాయిని తాకింది. నిఫ్టీ, సెన్సెక్స్‌లు జీవనకాల గరిష్టాలకు సుమారు రెండు శాతం దూరంలో ఉన్నాయి.

రాణించిన ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌, ఆటో స్టాక్స్‌..

ఎఫ్‌ఎంసీజీ (FMCG), ఆటో, బ్యాంకింగ్‌ రంగాల స్టాక్స్‌ రాణించగా.. ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌ 1.48 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 1.19 శాతం, ఆటో 0.59 శాతం, హెల్త్‌కేర్‌ 0.50 శాతం, బ్యాంకెక్స్‌ 0.48 శాతం పెరిగాయి. ఐటీ(IT) ఇండెక్స్‌ 1.69 శాతం, మెటల్‌ 0.87 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.74 శాతం, కమోడిటీ 0.72 శాతం, ఇన్‌ఫ్రా 0.52 శాతం నష్టపోయాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Small cap) 0.49 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.43 శాతం నష్టంతో ముగిశాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,737కంపెనీలు లాభపడగా 2,425 స్టాక్స్‌ నష్టపోయాయి. 164 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 156 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 126 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఆసియా పెయింట్‌ 4.18 శాతం, ఎంఅండ్‌ఎం 2.45 శాతం, ఎయిర్‌టెల్‌ 2.37 శాతం, ఐటీసీ 1.74 శాతం, హెచ్‌యూఎల్‌ 1.70 శాతం పెరిగాయి.

Top Losers : ఇన్ఫోసిస్‌ 2.14 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.84 శాతం, ఎటర్నల్‌ 1.64 శాతం, టెక్‌ మహీంద్రా 1.12 శాతం, టాటాస్టీల్‌ 1.03 శాతం నష్టపోయాయి.