అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bullet Train : భారతదేశం (India) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు(bullet train project)లో కీలక ముందడుగు పడింది. రైండు హైస్పీడ్ షింకన్సెన్ రైళ్లను ఇండియాకు అందించనుంది జపాన్.
వీటి ట్రయల్ రన్ ను తాజాగా అక్కడ ప్రారంభించింది. ట్రయల్ పూర్తయ్యాక వీటిని ఇండియాకు తరలించే అవకాశముంది. ఇవి 2026 నాటికి భారతదేశానికి వస్తాయని భావిస్తున్నారు. ఈ రైళ్లను ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్(Mumbai-Ahmedabad high-speed rail corridor)లో ట్రయల్ రన్ల కోసం ఉపయోగిస్తారు. ఇది దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం.
Bullet Train : అత్యంత వేగవంతమైన ప్రయాణం
జపాన్ అందించనున్నషింకన్సెన్ E5, E3 నమూనాలు(Shinkansen E5, E3 models) రైళ్లు అత్యంత వేగంతో ప్రయాణించనున్నాయి. జపాన్ అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన బుల్లెట్ రైళ్లలో ఒకటైన ఈ నమూనాలు గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. 2011లో జపాన్ ప్రారంభించిన ఈ నమూనాలను అత్యాధునిక సాంకేతికతతో అప్గ్రేడ్ చేశారు. ఇవి భారతదేశం హై-స్పీడ్ రైలు వ్యవస్థను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పరీక్షించడంలో సహాయపడతాయి. జపాన్ రైళ్లు మన దేశంలో ఉండే ప్రత్యేక వాతావరణంలో ఏ విధంగా పనితీరును కనబరుస్తాయన్న అంచనా వేయడానికి ట్రయల్ రన్ ఉపయోగపడుతుంది.
Bullet Train : 2027లో ప్రారంభమయ్యే ఛాన్స్
ఇండియాలో తొలి బుల్లెట్ రైలు 2027 సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశముంది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ మార్గంలో 2027 లో బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఈ కారిడార్లో జపాన్ బుల్లెట్ రైళ్ల ట్రయల్ రన్ 2026లో ప్రారంభమవుతుంది. ఇటీవలి జపాన్ రెండు షింకన్సెన్ రైలు సెట్లు E5, E3 సిరీస్లను – భారతదేశానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ను పరీక్షించడానికి ఈ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. E10 సిరీస్ అనేది 2030 ప్రారంభంలో ప్రారంభించబోయే మరింత అధునాతన షింకన్సెన్ మోడల్. దీనిని ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ మార్గం(Mumbai-Ahmedabad high-speed route)లో నడపాలని భావిస్తున్నారు. కానీ, ఇది ఇప్పట్లో సాకారం కాకపోవచ్చు.