Homeతాజావార్తలుNew Building Rules | రాష్ట్రంలో మారనున్న భవన నిర్మాణ నిబంధనలు.. 2026లో కొత్త రూల్స్​

New Building Rules | రాష్ట్రంలో మారనున్న భవన నిర్మాణ నిబంధనలు.. 2026లో కొత్త రూల్స్​

రాష్ట్రంలో త్వరలో కొత్త భవన నిర్మాణ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ రూపకల్పన తుది దశకు వచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : New Building Rules | రాష్ట్రంలో త్వరలో భవన నిర్మాణ నిబంధనలు (Building construction rules) మారనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ (UDBC) రూపకల్పన తుది దశకు వచ్చింది.

పట్టణాల అభివృద్ధి, నియంత్రణ వ్యవస్థను ఏకీకృతం చేయడం కోసం యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్‌ను తీసుకురావాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిల్డింగ్ కోడ్ రూపొందించే బాధ్యతలను ఎర్న్‌స్ట్, యంగ్ (ఈవై) సంస్థకు అప్పగించింది. వివిధ ప్రాంతాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేసిన ఈవై సంస్థ కొత్త ముసాయిదాను సిద్ధం చేసింది. ఆ నివేదికను ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు (HMDA Commissioner Sarfaraz Ahmed) అందజేసింది.

New Building Rules | ప్రస్తుతం అమలులో ఆ నిబంధనలు

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆగస్టులో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్​గా హెచ్​ఎండీఏ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ను నియమించింది. ఈ కమిటీ ఈవై సంస్థ ద్వారా భవన నిర్మాణానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో భవన నిర్మాణాలకు సంబంధించి 2012లో జారీ చేసిన జీ.వో 168 నిబంధనలు అమలు అవుతున్నాయి. వాటికి చేసిన సవరణలతో సమస్యలు తలెత్తుండటంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు (new rules) అమలులోకి తీసుకు రావాలని నిర్ణయించింది.

New Building Rules | హెచ్​ఎండీఏ, ఈవై సంయుక్తంగా..

హెచ్ఎండీఏ, ఈవై (HMDA and EY) సంస్థ సంయుక్తంగా యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్​ రూపొందించాయి. దీని రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలను (government departments) భాగస్వామ్యం చేశారు. జీహెచ్ఎంసీ, జలమండలి, సీడీఎంఏ, విద్యుత్ శాఖ, మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ బోర్డ్, హైడ్రా, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, డీటీసీపీ వంటి కీలక శాఖల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కోడ్​ తయారు చేశారు.

ప్రస్తుతం రూపొందించిన ముసాయిదా కమిటీ ఛైర్మన్, హెచ్ఎండీఏ కమిషనర్‌కు అందజేశారు. కమిటీ దానిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి అందించనుంది. దానిని సీఎం, సంబంధిత శాఖ మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిశీలించి ఆమోదిస్తే.. అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. డిసెంబర్​లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి 2026 నుంచి కొత్త బిల్డింగ్​ రూల్స్​ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.