అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని మేడ్చల్ (Medchal)లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి ఒక భవనం కూలిపోయింది. భవన శిథిలాలు పడడంతో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
మేడ్చల్లోని మార్కెట్ (Medchal Market) రోడ్డులో జాతీయ రహదారికి (National Highway) సమీపంలో శ్రీరాములు గౌడ్ అనే వ్యక్తికి చెందిన భవనం ఉంది. భవనం ముందు భాగంలో రెండు పూల దుకాణాలు, ఒక మొబైల్ దుకాణానికి అద్దెకు ఇచ్చారు. వెనక వైపు శ్రీరాములు గౌడ్ సోదరి తిరుపతమ్మ ఉంటున్నారు. ఆమె ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది.
Hyderabad | శిథిలాలు తగిలి..
భవనం సమీపం నుంచి నడుచుకుంటున్న వ్యక్తి పేలుడు ధాటికి మృతి చెందాడు. భవనం శిథిలాలు ఎగిరి వచ్చి అతడికి తగిలాయి. దీంతో తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో తిరుపతమ్మ, స్టేషనరీ కార్మికుడు రఫీక్ (23), మొబైల్ దుకాణం ఉద్యోగి దినేష్ (25) ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు దాటికి భవనంలోని మూడు దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సమీపంలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేడ్చల్లో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి
గ్యాస్ సిలిండర్ పేలడంతో.. కుప్పకూలిపోయిన ఇల్లు
వీధిలో ఉన్న ఓ వ్యక్తిపై ఇంటి శిథిలాలు మీద పడి మృతి
ఈ ఘటనలో మరో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
ఈ పేలుడు ధాటికి.. పక్కనున్న రెండు షాపులూ ధ్వంసం#GasCylinderBlast #Medchal… pic.twitter.com/DFQ1VV4jAg
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 5, 2025