Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి
Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి

అక్షరటుడే జక్రాన్​పల్లి: Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన జక్రాన్​పల్లి (jakranpally) మండలం పడకల్​ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషణ్​ అనే రైతుకు చెందిన పాడి గేదె శుక్రవారం సాయంత్రం ట్రాన్స్​ఫార్మర్​ వద్ద గడ్డి మేస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందింది. దీంతో వెంటనే రైతు విద్యుత్​శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

అయితే ట్రాన్స్​ఫార్మర్​ను (Transformer) ఆఫ్​ చేసి గేదెను తొలగించుకోవాలని వారు సమాధానం ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ట్రాన్స్​ఫార్మర్​ ఆఫ్​ చేస్తే గ్రామంలో విద్యుత్​ సరఫరా నిలిచిపోతుందని గ్రామస్థులు వాపోయారు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి వారు వచ్చి గేదెను తొలగించపజేశారని గ్రామస్థులు పేర్కొన్నారు.