Homeఆంధప్రదేశ్budameru flood | బుడమేరు నది పొంగి ప్రవహిస్తోందంటూ ప్ర‌చారాలు.. ఎన్టీఆర్ జిల్లా సీపీ క్లారిటీ

budameru flood | బుడమేరు నది పొంగి ప్రవహిస్తోందంటూ ప్ర‌చారాలు.. ఎన్టీఆర్ జిల్లా సీపీ క్లారిటీ

budameru flood | బుడమేరు పొంగి ప్రవహిస్తోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖరబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: budameru flood | బుడమేరు నది పొంగి ప్రవహిస్తోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌.వి. రాజశేఖరబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘మొంథా’ Motha తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు నది పొంగి ప్రవహిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ (సీపీ) ఎస్‌.వి. రాజశేఖరబాబు ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

budameru flood | త‌ప్పుడు ప్ర‌చారాలు..

జిల్లాలోని బుడమేరు, మున్నేరు సహా ప్రధాన వాగుల పరిస్థితిని పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని రాజశేఖరబాబు Rajasekhara Babu తెలిపారు. ఆధునిక డ్రోన్ కెమెరాల సాయంతో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ఎక్కడా వరద ముప్పు లేదని అన్నారు.

అలానే ప్రవాహం ఉప్పొంగిన పరిస్థితి లేదని కూడా స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ప్రజల్లో భయాందోళనలు రేపే విధంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, వదంతులను పంచుకోవద్దని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఈ సందర్భంగా బుడమేరు నది ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన తాజా చిత్రాన్ని కూడా విడుదల చేశారు.

ఇక ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా అర్థరాత్రి సమయంలో తీరం దాటినట్లు ఐఎండీ స్ప‌ష్టం చేసింది.

మ‌చిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు Kakinada సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు తెలియ‌జేశారు.