Shradhanand Ganj
Shradhanand Ganj | శ్రద్ధానంద్​ గంజ్​​లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలుకింద పడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్​ నగరంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు (Railway Police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సాయినగర్ (Sainagar) ప్రాంతానికి చెందిన రాజారపు శ్రీనివాస్ బీటెక్ పరీక్షలో ఫెయిల్​ అయినప్పటికీ పాసయ్యానని ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే శ్రీనివాస్​ ఫెయిల్​ అయ్యాడని కుటుంబీకులకు తెలియడంతో వారు నిలదీశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాస్​ రైలు కిందపడి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.