అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BT Roads for Thandas | లంబాడాలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్ (Banjara Bhavan)లో సేవాలాల్ మహరాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలో సైతం లంబాడా యువకులు తనను జెడ్పీటీసీగా గెలిపించారని చెప్పారు. 20 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. నేటికి కరెంట్ లేని తండాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో లంబాడ యువకుల పాత్రను ఆయన కొనియాడారు.
BT Roads for Thandas | బడులు ఏర్పాటు చేయాలి
ప్రతి గిరిజన తండాలో స్కూల్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రోడ్డు సౌకర్యం సైతం కల్పించాలన్నారు. లంబాడ యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఊర్లోనే ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం అనే ఆలోచనను తీసేసి గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలు సాధించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నల్లమలలో 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.
BT Roads for Thandas | కేసీఆర్ మాట తప్పారు
తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ముఖ్యమంత్రి అన్నారు. తాము మాత్రం దళితుడిని స్పీకర్ (Speaker) చేసి అధ్యక్షా అని పిలిచేలా చేశామని పేర్కొన్నారు. దళితులకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. తానే రాజు.. తానే మంత్రిని అని ఎక్కడా చెప్పలేదని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తానే బాధ్యుడిని అని మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు.