BSNL
BSNL | జియో, ఎయిర్‌టెల్‌కు షాక్.. త‌క్కువ ధ‌ర‌కే బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BSNL | దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ప్రీపెయిడ్ ఆఫర్‌(Prepaid Offer)ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ‘ఫ్రీడమ్ ఆఫర్’తో రూ.1కే నెల రోజుల పాటు నెట్, అన్‌లిమిటెడ్ కాల్స్(Unlimited Calls) ఆఫర్ ఇచ్చి ఆకట్టుకున్న బీఎస్ఎన్ఎల్, ఇప్పుడు కేవలం రూ.199 కే కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

రూ.199 ప్లాన్ డీటెయిల్స్ చూస్తే.. వాలిడిటీ: 28 రోజులు రోజువారీ డేటా: 2GB* (డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 40kbps), అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఫ్రీ SMSలు వ‌స్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు 2GB డేటా డైలీ ప్లాన్‌ను రూ.200 లోపు అందించడం లేదు.

BSNL | ప్రైవేట్ కంపెనీల‌కి పోటీగా..

జియో రూ.349 ప్లాన్ చూస్తే రోజుకు 2GB, అపరిమిత కాల్స్, JioTV యాక్సెస్ ఉంటుంది. ఇక ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ చూస్తే రోజుకు 2GB 5G డేటా, OTT సబ్‌స్క్రిప్షన్లు కాగా, వీఐ రూ.408 ప్లాన్ చూస్తే.. రోజుకు 2GB, SonyLIV యాక్సెస్, 64kbps స్పీడ్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్, ధర పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే, ఒక చిన్న లోపం ఏంటంటే ఇందులో 4G డేటా మాత్రమే లభిస్తుంది. ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రం ఇప్పటికే 5G సేవలు అందిస్తున్నారు.

ట్రాయ్ (TRAI) తాజా గణాంకాల ప్రకారం, బీఎస్ఎన్ఎల్(BSNL) కస్టమర్ బేస్ తగ్గుతోంది. జూలై 2025లో బీఎస్ఎన్ఎల్ 1.01 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ప్రస్తుతానికి ప్రభుత్వ టెలికాం సంస్థల మార్కెట్ వాటా 8% కన్నా తక్కువగా ఉంది. అదే సమయంలో జియో 4.83 లక్షలు, ఎయిర్‌టెల్ 4.64 లక్షల కొత్త యూజర్లను చేర్చుకున్నాయి. వొడాఫోన్-ఐడియా IDEA మాత్రం 3.59 లక్షల కస్టమర్లను కోల్పోయింది. మొత్తానికి, బీఎస్ఎన్ఎల్ కొత్త రూ.199 ప్లాన్ తో పోటీకి సై అంటుంది.. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్ కావాలనుకునే యూజర్లకు ఇది ఆకర్షణీయంగా మారనుంది.