BSF Sub-Inspector Mohammad Imtiaz | పాక్​ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఎస్సై మహ్మద్ ఇంతియాజ్ వీర మరణం
BSF Sub-Inspector Mohammad Imtiaz | పాక్​ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఎస్సై మహ్మద్ ఇంతియాజ్ వీర మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BSF Sub-Inspector Mohammad Imtiaz : పాక్​ దుశ్చర్యతో ఓ బీఎస్​ఎఫ్​ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ జిల్లాలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్​ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ sub inspector mohammad Imtiaz అమరుడయ్యాడు.

BSF ఆయన బలిదానాన్ని ధృవీకరిస్తూ, మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి సెల్యూట్​ చేసింది. మే 8, 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్‌లో ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం(మే 10) ప్రాణాలు విడిచాడు.

IB పై పాక్​ కాల్పులు జరిపిన టైంలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంతియాజ్ తన యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అసాధారణమైన ధైర్యం, విధి పట్ల అంకితభావాన్ని ప్రదర్శించి దేశ రక్షణకు ప్రాణాలు అర్పించాడు.

జమ్మూ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పాక్​ జరిపిన మోర్టార్, డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ సీనియర్ అధికారి, ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) Army Junior Commissioned Officer (JCO) సహా ఆరుగురు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. షెల్లింగ్ బాధిత నివాస ప్రాంతాలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా Chief Minister Omar Abdullah పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఏపీకి చెందిన జవాన్ మురళి సైతం వీర మరణం పొందారు. నేడు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.