అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BSF | సరిహద్దు ప్రాంతంలో పడి ఉన్న ఒక డ్రోన్ droneను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. BSF ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం ఆధారంగా అమృత్సర్ amritsar జిల్లాలోని రట్టన్‌ఖుర్డ్ గ్రామంలో డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులో మోహరించిన యాంటీ డ్రోన్ సిస్టమ్‌తో ఈ డ్రోన్ వ్యవసాయ పొలాల్లో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ operation sindoor అనంతరం పాకిస్తాన్ భారత్‌పై వందల డ్రోన్లతో దాడి చేయగా భారత్ వాటిని తిప్పి కొట్టింది. ఈ క్రమంలో సరిహద్దులోకి మళ్లీ డ్రోన్ రావడం కలకలం రేపింది.
