అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BSF Notification | నిరుద్యోగ యువతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) శుభవార్త అందించింది. కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 3588 ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ జూలై 26, 2025 నుంచి ప్రారంభమై ఆగస్టు 25, 2025 వరకు కొనసాగనుంది.మొత్తం పోస్టులు: 3588 కాగా, పురుషులకు: 3406, మహిళలకు: 182 పోస్ట్‌లు కేటాయించారు. ట్రేడ్ వారీగా పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్‌సైట్ bsf.gov.in చూడవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలని అనుకున్నవారు, కనీసం పదవ తరగతి (10th Class) పాసై ఉండాలి. మరోవైపు అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వ్డ్ కేటగిరీలకు వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
BSF Notification | ఆ పోస్ట్‌ల కోసమే..
టెక్నికల్ ట్రేడ్స్ (కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రిషియన్, పెంప్ ఆపరేటర్ వంటి) పోస్టులకు ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి అవసరం అని తెలియజేశారు. రెండు సంవత్సరాల కోర్సు లేదా కనీసం ఒక సంవత్సరం కోర్సుతో పాటు పని అనుభవం తప్పనిసరి అవసరం. విద్యార్హతలు, ఫిజికల్ ప్రమాణాలు, ట్రేడ్ అర్హతలు తదితర వివరాలు నోటిఫికేషన్‌లో (Notification) పేర్కొనబడతాయి. ఈ పోస్ట్‌ల ఎంపిక విధానంలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే.. ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ను సందర్శించండి. One Time Registration (OTR) క్లిక్ చేయండి. పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. లాగిన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు Documents అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజు చెల్లించండి. సబ్మిట్ చేసి ఫామ్ కాపీ సేవ్ లేదా డౌన్‌లోడ్ చేసుకోండి. ఆఖరి తేదీ: ఆగస్టు 25, 2025. దరఖాస్తు ప్రారంభ తేది: 26 జులై, 2025.