Homeక్రైంNizamabad City | నగరంలో ఒకరి దారుణ హత్య

Nizamabad City | నగరంలో ఒకరి దారుణ హత్య

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | నగరంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ (One Town Police Station) పరిధిలోని రైల్వే స్టేషన్ సిటీ ప్రైడ్ హోటల్ (City Pride Hotel) వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు.

సుమారు 50 ఏళ్లు ఉన్న ఆ వ్యక్తిని.. గుర్తుతెలియని వ్యక్తులు తాడుతో ఉరివేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మృతుడు గురించి పోలీసులు విచారణ చేపట్టగా.. అతడు రైల్వేస్టేషన్ ఏరియాలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​హెచ్​వో రఘుపతి వివరించారు.

Must Read
Related News