అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని బోర్గాం(పి) సమీపంలో యువకుడి దారుణ్య హత్య కలకలం రేపింది. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ (Si Srikanth) తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి) మెగా వాటర్ ప్లాంట్ (Mega water plant) వద్ద అర్ధరాత్రి దుండగులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చారు. యువకుడి ముఖంపై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
సమాచారం అందుకున్న నాలుగో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కాగా.. హత్యకు గురైన యువకుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. యువకుడి సమాచారం తెలిస్తే నాలుగో టౌన్లో సంప్రదించాలని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.