Homeక్రైంHyderabad | మాదాపూర్​లో యువకుడి దారుణ హత్య

Hyderabad | మాదాపూర్​లో యువకుడి దారుణ హత్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hyderabad | హైదరాబాద్​ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.

మాదాపూర్​ యశోద ఆస్పత్రి(Yashoda Hospital) వెనుక ఓ యువకుడిని దుండగులు హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మణికొండ ప్రాంతానికి చెందిన జయంత్​గౌడ్​(21) తన తల్లి బర్త్​ డే సందర్భంగా ఫ్రెండ్స్​కు పార్టీ ఇవ్వాలని భావించాడు. ఎనిమిది మంది స్నేహితులతో కలిసి యశోద ఆస్పత్రి వెనకాల మద్యం తాగుతుండగా ముగ్గురు దుండగులు వచ్చి వారిని బెదిరించారు.

బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. వారితో జయంత్​గౌడ్​ అతని స్నేహితులు వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో దుండగులు జయంత్ గౌడ్​పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు(Madhapur Police) ఘటన స్థలంలో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.