అక్షరటుడే, లింగంపేట: Lingampet Mandal | ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన లింగంపేట మండలం పోల్కంపేటలో (Polkampet village) శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
లింగంపేట పోలీసులు (Lingampet police) తెలిపిన వివరాల ప్రకారం.. పోల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన (75)కు ఇద్దరు కుమారులున్నారు. వంతులో భాగంగా వారంరోజుల క్రితం ఆమె పెద్ద కుమారుడు రాజుల వద్దకు వెళ్లింది. అయితే రాజుల కుటుంబం మూడు రోజుల క్రితం తీర్థయాత్రకు వెళ్లింది. ఇంట్లో ఆమె ఒకతే ఉందని పసిగట్టిన దుండగుడు శుక్రవారం రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేసి ఆమెపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను (gold ornaments) దోచుకెళ్లాడు. అందులో ఒక పుస్తెలతాడు, కమ్మలు, వంక ఉంగరం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Lingampet Mandal | ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
గ్రామంలో వృద్ధురాలు హత్యకు గురికావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు (Yellareddy DSP Srinivas Rao) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాజు రెడ్డి, ఎస్సై దీపక్ కుమార్‌లు ఆయనకు వివరాలు తెలియజేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో దుండగుల కోసం గాలించారు.
Lingampet Mandal | పోలీసుల అదుపులో యువకుడు..?
వృద్ధురాలు హత్యకు గురికావడంతో డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం ఆధారంగా హత్యకు గురైన వృద్ధురాలి ఇంటి సమీపంలో ఉండే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగారం ధర పెరగడంతోనే ఆశతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.