Homeక్రైంTamilnadu | వివాహేతర సంబంధానికి అడ్డువ‌స్తున్నాడ‌ని.. సాంబారులో విషం కలిపి భ‌ర్త‌ని హత్య చేసిన భార్య‌

Tamilnadu | వివాహేతర సంబంధానికి అడ్డువ‌స్తున్నాడ‌ని.. సాంబారులో విషం కలిపి భ‌ర్త‌ని హత్య చేసిన భార్య‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamilnadu | వివాహేతర సంబంధాల కారణంగా జీవిత భాగస్వామిని కాటికి పంపుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల తరచూ వెలుగుచూస్తున్న ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ, తన భర్తను చంపేందుకు కుట్ర పన్ని భోజనంలో విషయం కలిపి ఇచ్చింది. వివాహేతర సంబంధానికి (Extramarital Affair) అడ్డుగా మారాడనే కోపంతో హత్యకు తెగబడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలోని (Dharmapuri District) అరూర్ సమీపంలోని కీర్తెపట్టి గ్రామానికి (Keerthepatti Village) చెందిన రసూల్ (వయస్సు 43) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అమ్ముబి (35), ఇద్దరు పిల్లల తల్లి. ఇటీవల అమ్ముబికి ఇంటి సమీపంలో ఉండే లోకేశ్వరన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను సెలూన్ షాప్ నడుపుతుండగా, వారి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ సీక్రెట్‌గా కలుసుకుంటూ, వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవారు.

Tamilnadu | ఎంత దారుణం..

ఇటీవ‌ల లోకేశ్వరన్ తన ఛాతీపై అమ్ముబి పేరుతో టాటూ వేయించుకోవడం, వారి సంబంధం ఎంత బ‌లంగా మారిందో తెలియ‌జేస్తుంది.. ఒకరోజు రసూల్ లోకేశ్వరన్ సెలూన్ షాప్‌కి వెళ్లగా, అదే సమయంలో అమ్ముబి అతనికి వీడియో కాల్ చేసింది. ఇది గమనించిన రసూల్ కోపంతో లోకేశ్వరన్‌పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను తిడుతూ కొట్టాడు. అప్పటి నుంచి.. తమ ప్రేమకు రసూల్​ అడ్డుగా మారాడనే ఆలోచనతో ఇద్దరూ అతడిని చంపేయాలని నిర్ణయానికి వచ్చారు. లోకేశ్వరన్ ఇచ్చిన పురుగుల మందును అమ్ముబి ఐదు రోజుల పాటు భర్తకు ఇవ్వడానికి ప్రయత్నించింది. చివరకు సాంబారులో కలిపి భోజనం పెట్టింది. అదృష్టవశాత్తు పిల్లలు ఆ ఆహారం తినకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

భోజనం తిన్న రసూల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షించి ఆహారంలో విషం ఉందని నిర్ధారించారు. ఇది విని షాక్‌కి గురైన రసూల్, తన భార్యపై అనుమానంతో తన తమ్ముడి భార్య ఆసినాకు ఫోన్ చెక్ చేయమని కోరాడు. ఆమె ఫోన్ చెక్ చేయ‌గా, లోకేశ్వరన్​కు పంపిన‌ వందలాది మెసేజ్‌లు, ఆడియోలు బయటపడ్డాయి. వాటిలో అమ్ముబి, “దానిమ్మ రసంలో మందు కలిపితే తాగలేదు.. అందుకే సాంబారులో కలిపి ఇచ్చాను” అని చెప్పిన ఆడియో ఉండడం పోలీసులకు ఆధారంగా మారింది. రసూల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అమ్ముబి, లోకేశ్వరన్ ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సేకరించారు. అయితే, రసూల్ ఆరోగ్యం మరింత విషమించడంతో, అతన్ని ధర్మపురిలోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.