అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణకు (Telangana) జరిగే అన్యాయంపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి (BRSV General Secretary Madhukar Reddy) తెలిపారు.
నగరంలోని సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కళాశాలలో బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) కారణంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించాలనే ఉద్దేశంతో కరపత్రాలను ఆవిష్కరించామన్నారు. శనివారం జరుగనున్న బీఆర్ఎస్వీ సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), జగదీశ్వర్ రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. సదస్సుకు విద్యార్థులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నవాకిశోర్, భాస్కర్, నితిన్, శషాంక్, చింటూ తదితరులు పాల్గొన్నారు.