అక్షరటుడే, వెబ్డెస్క్: BRS Municipal Chairperson Wins | రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. సోమవారం 11 చోట్ల ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయా మున్సిపాలిటీల్లో మంగళవారం ఎన్నిక నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేనసుకుంది. ఛైర్పర్సన్గా కిషంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్గా పట్లోళ్ల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీఆర్ఎస్ (BRS) గెలుపొందింది. ఈ మున్సిపాలిటీని గెలుచుకోవడానికి కాంగ్రెస్ యత్నించినా.. బీఆర్ఎస్ పకడ్బందీగా వ్యవహరించి పీఠం చేజారకుండా చర్యలు చేపట్టింది.
BRS Municipal Chairperson Wins | ఇబ్రహీంపట్నంలో..
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఛైర్మన్గా టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ ఛైర్పర్సన్గా ముత్యాల శ్యామల ఎన్నిక అయ్యారు. 15 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం అయింది. అయితే ఎన్నిక సందర్బంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం సైతం కార్యాలయంపై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా కౌన్సిల్ హల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు (Congressional Councilors) బల్లాలు ఎత్తి పడేశారు. ఛైర్మన్ ఎన్నిక కోసం రహస్య ఓటింగ్ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అయితే అధికారులు అందుకు ఒప్పుకోలేదు. చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ బీఆర్ఎస్ బలం 15, కాంగ్రెస్ బలం 10 ఉంది. దీంతో గులాబీ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మిగతా మున్సిపాలిటీల్లో ఎన్నిక ప్రక్రియ సాగుతోంది. తొర్రూరు, క్యాతనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.